AP Sankranthi: ముస్తాబవుతున్న నారావారిపల్లె... సందడంతా వియ్యంకులదే..!

AP Sankranthi:  ముస్తాబవుతున్న నారావారిపల్లె... సందడంతా  వియ్యంకులదే..!
సంక్రాంతి సంబరాలకు సిద్ధమౌతున్న నారావారిపల్లె గ్రామం... సంబరాల్లో పాలుపంచుకోనున్న చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు


ఈసారి సంక్రాంతి సందడంతా నారావారిపల్లే లోనే కనిపించేట్టు ఉంది. పండగ పురస్కరించుకని అప్పడే గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సారి పండగంతా వియ్యంకులదే హడావిడితోనే సరిపోయేట్టు కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు, బాలకృష్ణ పల్లెకు పయనమవుతుండటంతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దున్నారు.


సంక్రాంతి వేడుకల కోసం గ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇక విద్యార్థులకు క్రీడా పోటీల కోసం మైదాన్ని సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి కార్యక్రమాల్లో భాగంగా గొబ్బెమ్మ, సాంస్కృతిక పాటలు, మిమిక్రీ, హరిదాసు ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.


పండగ రోజున గ్రామస్థులు తమ ఇంటి దైవం నాగాళమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు నందమూరి, నారావారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇక సంక్రాంతి ఏర్పాట్లను టీడీపీ నేత పులిపర్తి నానితో పాటు నారావారిపల్లెకు చెందిన టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story