AP Sankranthi: పండగ సందడి... అడ్డంగా దండుకోవడమే పని..!

AP Sankranthi: పండగ సందడి... అడ్డంగా దండుకోవడమే పని..!
ఏపీలో సంక్రాంతి సందడి; కరువైన వసతి సౌకర్యాలు; కిటకిటలాడుతున్న హోటళ్లు,లాడ్జ్‌లు; రేట్లు పెంచేసిన హోటల్‌ యాజమాన్యాలు

Sankranthi: ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అతిధులకు వసతి సౌకర్యాలు కరువయ్యాయి.. భీమవరం పరిసర ప్రాంతాల్లో పండుగకు బంధువులను, స్నేహితులను ఆహ్వానించి అతిధి మర్యాదలు చేయడం ఆనవాయితీ. దీంతో జిల్లాలోని హోటల్‌ రూములను ఇప్పటికే బుక్‌ చేసుకోవడం తో వసతి సౌకర్యం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా కోడి పందేల కోసం వస్తున్న అతిథుల తాకిడి అధికంగా ఉండడంతో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి.




భీమవరంలో ప్రతి హోటల్‌ ముందూ నో రూమ్స్‌ బోర్డ్ లు దర్శనిమిస్తున్నాయి. రెండు, మూడు నెలల ముందే ఫుల్‌ పేమంట్‌తో రూమ్‌లు బుక్కైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఒక వేళ రూములు ఉన్నా వాటి ధరలు కళ్లు భైర్లు కమ్మేట్లు ఉన్నాయి. ఐదు రోజుల ప్యాకేజీ తీసుకోవాలని.. అందుకు 35వేల నుంచి 45 వేల వరకు అద్దె ముందుగా కట్టాలని షరతులు విధించడంతో అతిథులు షాక్‌ అవుతున్నారు. డిమాండ్‌ను అవకాశంగా తీసుకొని ప్యాకేజీల పేరుతో అధిక రేట్లు వసూలు చేయడం దారుణమని మండిపడుతున్నారు.




మరోవైపు అతిధుల కోసం రెస్టారెంట్లు రెడీ అయిపోయాయి. సంక్రాంతి స్పెషల్‌ డిష్‌లను సిద్ధం చేస్తున్నాయి.. ప్రత్యేక అలంకరణలతో పాటు పిండివంటలు సిద్ధం చేసేస్తున్నారు. నోరూరించే సాంప్రదాయ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. గోదావరి జిల్లాల ప్రత్యేకం అయిన సీ ఫుడ్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిధిల కోసం రాయలసీమ, తెలంగాణ వంటకాలతో ప్రత్యేక మెనూను కూడా రెడీ చేస్తున్నారు. ఏమైనా సంక్రాంతికి గోదావరి జిల్లాలు అప్పడే పండగ కళను సంతరించుకన్నాయి అనడంలో సందేహమే లేదు.



Tags

Read MoreRead Less
Next Story