బిగ్ బ్రేకింగ్.. మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు

మంత్రి కొడాలి నాని పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల జరిగే సమయంలో.. ప్రెస్ మీట్ లో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దురుద్దేశ ప్రకటనలతో ఉన్నాయని తెలిపింది. కొడాలి నాని ప్రెస్ మీట్ వీడియోను పరిశీలించిన అనంతరం.. అత్యవసరంగా వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ కోరింది.
సాయంత్రం 5 గంటల లోపు షోకాజ్ నోటీస్‌కు సమాధానం చెప్పాలని ఎస్ఈసీ ఆదేశించింది. స్వయంగా కానీ, రిప్రజెంటేషన్ ద్వారా కానీ సమాధానం ఇవ్వాలని సూచించింది. తక్షణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని మంత్రి కొడాలి నానిని ఎస్ఈసీ ఆదేశించింది.
నిన్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పథకాలను తీసుకుంటూ.. తమకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించినట్లు వీడియో వైరల్ అయింది. దీనిపై సీరియస్ అయిన ఎస్ఈసీ.. ఈనెల 13 వరకు మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది. అలాగే ప్రజలతో కూడా మాట్లాడొద్దని.. బహిరంగ సమావేశాల్లో ప్రసంగించొద్దని ఎస్ఈసీ ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com