నిఘా యాప్ రిలీజ్‌ చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

నిఘా యాప్ రిలీజ్‌ చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికలలో బెదిరింపులు, అక్రమాలను యాప్‌ ద్వారా నేరుగా ఎస్‌ఈసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చే విధంగా యాప్ రూపొందించారు.

ఎన్నికలలో మద్యం, డబ్బు, అక్రమాలపై ప్రత్యేక నిఘా కోసం యాప్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ-వాచ్ పేరుతో నిఘా యాప్ రిలీజ్‌ చేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. యాప్ వివరాలను ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు వివరించారు. పంచాయతీ ఎన్నికలలో దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమాలను యాప్‌ ద్వారా నేరుగా ఎస్‌ఈసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చే విధంగా యాప్ రూపొందించారు.

మరోవైపు పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో.. పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ, ఎన్నికల శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారి ఏడీజీ సంజయ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story