వార్డు వాలంటీర్లపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ఏపీలో వార్డు వాలంటీర్లతో చట్టవిరుద్ధంగా ఎన్నికల పనులు చేయిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.. రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఎస్‌ఈసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. వార్డు వాలంటీర్ల వినియోగాన్ని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల వినియోగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించడం కిందకు వస్తుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. అలాగే వార్డు వాలంటీర్లను వినియోగిస్తున్నట్లుగా గమనిస్తే.. ఆ విషయాన్ని కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావచ్చని పేర్కొంది.. అలాగే, ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు కూడా స్వీకరించనున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది.. వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. వార్డు వాలంటీర్లు ఓటర్లను సంప్రదించడం, పర్భావితం చేయడం ఎన్నికల చట్టం ప్రకారం నేరంగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com