ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ లేఖ

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ లేఖ

స్థానిక ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి... ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మధ్య వార్‌ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమన్న నిమ్మగడ్డ... రాజ్యాంగంలోని 243 K అధికరణ కింద ఈసీకి స్వయంప్రత్తి ఉందని తెలిపారు. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్‌ విధి అని... ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లకు సమాన అధికారాలున్నాయని చెప్పారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్న నిమ్మగడ్డ... అలాంటి ఆర్డినెన్స్‌ తమ అనుమతి కోసం వస్తే తిరస్కరించాలని గవర్నర్‌ను కోరారు.


Tags

Next Story