కరోనా ఉధృతి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలి : ఏపీ సచివాలయ ఉద్యోగులు

కరోనా ఉధృతి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలి :  ఏపీ సచివాలయ ఉద్యోగులు
కరోనా ఉధృతి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వినతిపత్రం సమర్పించారు.

కరోనా ఉధృతి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటివరకు సచివాలయంలో నలుగురు ఉద్యోగలు చనిపోయారని.. గతేడాది ఇద్దరు మృతిచెందారని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నాప ప్రసాద్ తెలిపారు. దీంతో తమంతా భయపడుతున్నామని.. 40నుంచి50 మంది ఉద్యోగులు హోం ఐసోలేషన్ లో ఉన్నారన్నారు. అందుకే వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉందని ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ సోకుతోందని సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సుజాత వెల్లడించారు. ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

Tags

Next Story