టీవీ5 చేతిలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌..!

టీవీ5 చేతిలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌..!
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో సీఐడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టు ఫైల్‌ చేశారు.. ఈరిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొన్నారు..

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో సీఐడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టు ఫైల్‌ చేశారు.. ఈరిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొన్నారు.. స్కామ్‌లో నేరపూరిత కుట్ర ఉందని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు సీఐడీ అధికారులు.. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావు, నిమ్మగడ్డ వెంకట కృష్ణ కలిసి నిధుల దుర్వినియాగానికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నారు.. మొత్తం 371 కోట్ల రూపాయలు నేరుగా డిజైన్‌ టెక్‌ అకౌంట్‌లోకి వెళ్లాయని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.. నిధులు అక్కడి నుంచి హవాలా మార్గం ద్వారా వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని సీఐడీ ఆరోపిస్తోంది.. సిమెన్స్‌ ఉద్యోగి, మరో ఇద్దరు ఉద్యోగులకు కూడా స్కామ్‌తో సంబంధం ఉందంటోంది.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆధారాలు సమర్పించాల్సి ఉందని సీఐడీ అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story