రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతోంది : సీఎంకు లేఖ రాసిన కళా

రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతోంది : సీఎంకు లేఖ రాసిన కళా
రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతోందంటూ సీఎం జగన్‌కు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు..

రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతోందంటూ సీఎం జగన్‌కు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీకి ఆదేశిస్తే.. భూఅక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పడానికి సిద్ధమన్నారు. వైసీపీ నేతలకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని మరో సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని ఆరోపించారు. ఇంద్రుడు కుళ్లుకొనే విధంగా సకల భోగాలతో జిల్లాకో రాజప్రాసాదం నిర్మించుకొంటున్నారని... పేదలను స్మశానాలు, ముంపు ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోమంటున్నారని ఆయన లేఖలో వ్యాఖ్యానించారు. ఇలాంటి భూముల్లో వైసీపీ నేతలు ఇళ్లు క‌ట్టుకుని ఉండ‌గ‌ల‌రా..? అని ప్రశ్నించారాయన.

Tags

Read MoreRead Less
Next Story