గ్రామ/వార్డు సచివాలయ నియామకాలు: కంట్రోల్‌ రూం నెంబర్లు

గ్రామ/వార్డు సచివాలయ నియామకాలు: కంట్రోల్‌ రూం నెంబర్లు

ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే నియామకాలకు సంబంధించి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. అభ్యర్థులు కమాండ్‌ కంట్రోల్‌ రూం నంబర్లు 9121296051/52/53కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఇ-మెయిల్ ద్వారా అభ్యర్దులు తమ ఫిర్యాదులను లిఖిత పూర్వక౦గా ఏ శాఖకు సంబంధించిన ఫిర్యాదు ఆ శాఖకు పంపించాలి. మెయిల్‌ ఐడీ వివరాల కోసం.. http://gramasachivalayam.ap.gov.in/లేదా http://vsws.ap.gov.in/ లేదా http://wardsachivalayam.ap.gov.in/సైట్లను సందర్శించవచ్చు.ఇదిలావుంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాలకు ఈ నెలలో పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story