రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు : శైలజానాథ్‌

రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు : శైలజానాథ్‌
ఏపీలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతుంటే... నిందితులను అరెస్టు చేయడానికి మాత్రం ప్రభుత్వానికి రెండు, మూడు నెలల సమయం..

ఏపీలో ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతుంటే... నిందితులను అరెస్టు చేయడానికి మాత్రం ప్రభుత్వానికి రెండు, మూడు నెలల సమయం పడుతోందని.. ఏపీ పీసీసీ చీఫ్‌ శైలజానాథ్ విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్‌ సుధాకర్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు 50 ఘటనలకు పైగానే జరిగాయని మండిపడ్డారు. చివరికి రాష్ట్రపతి జోక్యం చేసుకున్నా కూడా సీతానగరం బాధితుడికి సరైన న్యాయం జరగలేదన్నారు. ఇకపై రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని శైలజానాథ్‌ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story