AP: పరీక్ష తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ

AP: పరీక్ష తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ
X

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు.. కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎనిమిది ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి 30 వరకూ ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అసిస్టెంట్ డైరెక్టర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ ఎలక్రికల్ ఇన్ స్పెక్టర్, ఏఎస్‌వో, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు ఇప్పటికే అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కసరత్తులు చేసి తేదీలను ఫైనల్ చేసింది. దీంతో ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. బాగా ప్రిపుర్ అయ్యి ఉద్యోగాలు పొందాలని అభ్యర్థులకు సూచించింది.

Tags

Next Story