ఎస్ఈసి నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ రద్దు

ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, జెడ్పీ CEOలు, జిల్లా పంచాయితీ అధికార్లతో SEC వీడియో కాన్ఫరెన్స్ సమావేశం రద్దయింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని.. ముందుగానే SEC రమేష్ కుమార్ నిర్ణయించారు. ఆ మేరకు భేటీలో పాల్గొనాలని నిన్న అధికారులకు రమేష్ కుమార్ లేఖ రాశారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నట్టు అధికారులకు పంపిన లేఖలో SEC తెలిపారు. పంచాయితీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ సమావేశంలో పాల్గొనాలని.. SEC రమేష్ కుమార్ కోరారు. సమావేశంలో పాల్గొనేందుకు సీఎస్‌ను ఇప్పటికే అనుమతి కోరినట్టు SEC రమేష్ కుమార్ తెలిపారు. అయితే... ఈ వీడియో కాన్ఫరెన్స్‌పై అభ్యంతరం తెలుపుతూ CS లేఖ రాయడంతో... వీడియో కాన్ఫరెన్స్‌ను SEC రద్దు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com