ఏపీ సరిహద్దు వరకూ బస్సులు

X
ఏపీ, తెలంగాణల మధ్య ఇప్పట్లో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ పడేలా కనిపించడం లేదు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాల మధ్య ఒప్పందాలు కుదరడం లేదు. దీంతో ఏపీ సరిహద్దు వరకూ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాలుగో విడత చర్చలు కూడా విఫలవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దసరా సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి విజయవాడకు బస్‌లు ఏర్పాటు చేశామన్నారు ఏపీ ఆర్టీసీ విజయవాడ జోన్ ఈడీ వెంకటేశ్వరరావు. హైదరాబాద్‌కు బస్‌లు నడపలేకపోయినా.. సరిహద్దుల వరకు నడుపుతమని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి గరికపాడకు.. గుంటూరు జిల్లాలో చెక్‌పోస్టు వరకు బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
