AP: తిరుపతి డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ

AP: తిరుపతి డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ
X
ప్రశాంతంగా ముగిసిన డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఆసక్తి రేపిన ఎన్నిక

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగిన ఈ ఎన్నికలో డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి R. C. మునికృష్ణ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతుగా 26 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లడ్డూ భాస్కర్‌కు 21 ఓట్లు దక్కాయి. సోమవారమే డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా, తగిన కోరం లేకపోవడంతో ఎన్నికను మంగళవారం తిరిగి నిర్వహించారు. సోమవారం నాటి హైడ్రామా సంఘటనలతో ఎన్నికల్లో టెన్షన్‌ తప్పదని అందరూ భావించారు. అయితే ప్రశాంతంగా డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరిగిపోయింది. మొదట ఎంపీ గురుమూర్తితో కలిసి 22 మంది వైసీపీ సభ్యులు బస్సులో సెనేట్‌ హాలుకు చేరుకున్నారు. ఆతర్వాత ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు 26 మంది కార్పొరేటర్లతో హాజరయ్యారు

అసలు ఏమైందంటే..

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. మొత్తం 50 మంది ఓటర్లుగా ఉండగా 48 మంది ఎన్నికకు హాజరయ్యారు. ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ షాలిని రెడ్డి గైర్హాజరయ్యారు. హాజరైనవారిలో 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ అమరనాథ్‌ రెడ్డి తటస్థంగా ఉండి ఎవరికీ మద్దతుతెలపలేదు.

ఎమ్మెల్యే కోటంరెడ్డితో డిప్యూటీ మేయర్ భేటీ..

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలను నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తహసిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ‌ ముందుగా వారిని తహసీన్ శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని తహసీన్ కు ఎమ్మెల్యే సూచించారు. ‌

Tags

Next Story