విషాద యాత్రగా ముగిసిన విహార యాత్ర.. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు!

విషాద యాత్రగా ముగిసిన విహార యాత్ర.. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు!
అరకు లోయలో బస్సు బోల్తా పడడంతో నలుగురు చనిపోగా, 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులున్నారు.

విహార యాత్ర విషాద యాత్రగా ముగిసింది. విశాఖ జిల్లా అరకు లోయలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడడంతో నలుగురు చనిపోగా, 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులున్నారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాంద నెలకొంది.

నిన్న సాయంత్రం అరకు డముకు ఘాట్ రోడ్డులోని ఐదో నంబర్ మలుపు వద్ద బోల్తా పడిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 26 మంది ఈ నెల 10న దినేష్ ట్రావెల్స్ బస్సులో బయల్దేరారు. వీరిలో 19 మంది పెద్దలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. విజయవాడలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. విశాఖ చేరుకున్నారు. గురువారం విశాఖ నగరంలోని వివిధ సందర్శన ప్రాంతాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం అరకుకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో భాగంగా బొర్రా గుహలను సందర్శించడానికి సింహాచలం బయల్దేరారు.

తిరుగు పయనం అవుతున్నట్లు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. అనంతగిరి మండలం డుముకు గ్రామం దాటిన తర్వాత రాత్రి 7 గంటల సమయంలో బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో మూడు వందల అడుగుల లోయలోకి బస్సు పడిపోయింది. అయితే, డ్రైవర్‌కు ఘాట్‌ రోడ్డుపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు చీకటి పడటం, దారిని అంచనా వేయలేకపోవడంలో డ్రైవర్‌ విఫలమై ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాద వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు నలుగురు మరణించినట్లు చెబుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story