ఇన్​చార్జి తహసీల్దార్​పై వీఆర్​ఏల ఆరోపణలు

ఇన్​చార్జి తహసీల్దార్​పై వీఆర్​ఏల ఆరోపణలు
X
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఈశ్వరయ్య వీఆర్ఏల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తహసీల్దార్ ఈశ్వరయ్య VRAలను అసభ్య పదజాలంతో దూషించారు. భోజనం వడ్డించేందుకు వీఆర్ఏలు రావడం లేదని అంతు చూస్తానంటూ వారిని బెదిరించారు. VRAల సంఘం నాయకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఈశ్వరయ్యతో వాగ్వాదానికి దిగారు. టీ, భోజనం, సిగరెట్లు తేవాలని వేధిస్తూ తమను బానిసల్లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను కొందరు ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి.. ఘటనపై విచారణ చేపట్టారు.


Tags

Next Story