గుంటూరు జిల్లాలో జవాను ఇల్లు కూల్చివేత
BY Nagesh Swarna5 Dec 2020 1:41 PM GMT

X
Nagesh Swarna5 Dec 2020 1:41 PM GMT
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ జవాను ఇల్లుని కూల్చివేయడం కలకలం రేపుతోంది. బరంపేటలో జవాన్ గోవిందరెడ్డి నిర్మించుకున్న ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ భూములో ఉందంటూ కూల్చివేశారు. ఈ ఘటనపై గోవిందరెడ్డి కన్నీటిపర్యంతమవుతున్నారు. 18 సంవత్సరాలుగా ఆర్మీలో సేవలందిస్తూ.. కూడబెట్టిన డబ్బుతో ఇంటిని నిర్మించుకుంటే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. సీఎం జగన్‌కు సెల్ఫీ వీడియో పంపారు జవాను గోవింద రెడ్డి. రాజకీయ కారణాలతోనే తన ఇంటిని కూల్చారని దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. మున్సిపాల్టీ సిబ్బంది తాము ఇంటిని కూల్చలేదని చెబుతున్నారని.. మరి ఎవరు, ఎందుకు పడగొట్టారో చెప్పాలని నిలదీశారు. ఈ ఘటనపై ఇప్పటికే గుంటూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు గోవిందరెడ్డి.
Next Story