Army Officer Saiteja : భార్యతో వీడియో కాల్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే..!
Army Officer Saiteja : తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ ఆఫీసర్ సాయితేజ చనిపోయారు. కురబల కోట మండలం రేగడ గ్రామానికి చెందిన సాయితేజ... జనరల్ బిపిన్ రావత్ కింద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.
సాయితేజ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సాయితేజ సొంతూరు రేగడలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయితేజ చనిపోయే కొన్ని గంటల ముందు తన భార్య శ్యామలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.కొడుకు మోక్షజ్ఞ, కుమార్తె దర్శిని ఉన్నారు.
కూతుర్ని చూడాలని ఉందని నిన్న ఉదయం 8 గంటలకి భార్యకి ఫోన్ చేసి ఆనందంగా మాట్లాడాడు సాయితేజ.. ఆ తర్వాత కొన్ని గంటల్లో జరిగిన ప్రమాదంలో అతను మరణించాడు. భర్త మరణ వార్త వినగానే సాయితేజ భార్య శ్యామల సొమ్మసిల్లి పడిపోయారు.
సాయితేజ టాలెంట్ కి ఫిదా అయిన బిపిన్ రావత్ తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com