ARREST: ఎమ్మెల్యే కుమారుడి అరెస్టుతో కలకలం

ARREST: ఎమ్మెల్యే కుమారుడి అరెస్టుతో కలకలం
X
డ్రగ్స్ దందాపై ఈగల్ ఉక్కుపాదం

ఏపీ ఎమ్మె­ల్యే తన­యు­డు డ్ర­గ్స్ వి­ని­యో­గి­స్తూ హై­ద­రా­బా­ద్ ఈగల్ టీం­కు చి­క్కా­డు. గం­జా­యి తీ­సు­కుం­టూ కడప జి­ల్లా జమ్మ­ల­మ­డు­గు MLA ఆది­నా­రా­య­ణ­రె­డ్డి కు­మా­రు­డు సు­ధీ­ర్‌­రె­డ్డి దొ­రి­కా­డు. పక్కా సమా­చా­రం అం­ద­డం­తో.. ఇం­టి­కి వె­ళ్లి డ్ర­గ్స్‌ టె­స్ట్ చే­య­గా… సు­ధీ­ర్‌­రె­డ్డి­కి పా­జి­టి­వ్ వచ్చి­న­ట్లు అధి­కా­రు­లు తె­లి­పా­రు. గతం­లో రెం­డు­సా­ర్లు డ్ర­గ్స్ కే­సు­లో సు­ధీ­ర్ రె­డ్డి పట్టు­బ­డి­న­ట్లు సమా­చా­రం. సు­ధీ­ర్ రె­డ్డి­ని డీ అడి­క్ష­న్ సెం­ట­ర్‌­కు తర­లిం­చా­రు. డ్ర­గ్స్‌ ఎవరు సప్ల­య్‌ చే­శా­ర­న్న కో­ణం­లో పో­లీ­సుల ఆరా తీ­స్తు­న్నా­రు. సు­ధీ­ర్ రె­డ్డి తం­డ్రి ఆది­నా­రా­యణ రె­డ్డి.. ప్ర­స్తు­తం బీ­జే­పీ ఎమ్మె­ల్యే­గా ఉన్నా­రు. గతం­లో టీ­డీ­పీ మం­త్రి­గా పని­చే­శా­రు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధీర్ రెడ్డితో పాటు ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం సుధీర్ రెడ్డిని అధికారికంగా అరెస్ట్ చేసి, నిబంధనల ప్రకారం డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

మళ్లీ డ్రగ్స్ కేసులోనే...

గతం­లో­నూ మాదక ద్ర­వ్యాల వి­ని­యో­గం కే­సు­ల్లో సు­ధీ­ర్ రె­డ్డి పో­లీ­సు­ల­కు పట్టు­బ­డి­న­ట్లు తె­లు­స్తోం­ది. అయి­తే అప్ప­ట్లో ఎలా­గో­లా తప్పిం­చు­కు­న్న ఆయన.. మరో­సా­రి డ్ర­గ్స్ సే­వి­స్తూ పట్టు­బ­డి­న­ట్లు సమా­చా­రం. గతం­లో టీ­డీ­పీ, వై­ఎ­స్సా­ర్సీ­పీ­లో ఉన్న ఆది­నా­రా­య­ణ­రె­డ్డి గత ఎన్ని­క­ల­కు ముం­దు బీ­జే­పీ­లో చే­రా­రు. జమ్మ­ల­మ­డు­గు నుం­చి ఎమ్మె­ల్యే­గా గె­లి­చా­రు. ఇప్పు­డు డ్ర­గ్స్ కే­సు­లో తన కు­మా­రు­డు పట్టు­బ­డ­టం­తో దీ­ని­పై బీ­జే­పీ లేదా కూ­ట­మి ప్ర­భు­త్వం ఎలా స్పం­ది­స్తుం­దో చూ­డా­ల్సి ఉంది. సుధీర్ రెడ్డి ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం ఇదే మొదటిసారి కాదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా రెండుసార్లు ఇదే తరహా మాదకద్రవ్యాల కేసుల్లో ఆయన పోలీసులకు దొరికినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వరుసగా మూడోసారి డ్రగ్స్ కేసులో చిక్కడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.

Tags

Next Story