APSRTC: వాట్సాప్‌లోనూ RTC బస్ టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌లోనూ కూటమి ప్రభుత్వం.. వాట్సాప్ ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, ఆర్టీసీ టిక్కెట్లను కూడా ఇందులో బుక్ చేసుకోవచ్చని APSRTC తెలిపింది. వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, బస్ డిపో మేనేజర్లకు సూచించింది. దూరప్రాంత బస్ సర్వీసులు అన్నింటా వాట్సప్ ద్వారా టికెట్ బుకింగ్‌కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది.
వాట్సాప్‌లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయాలి. అప్పుడు ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అందులో RTC టికెట్ బుకింగ్/రద్దు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత బయల్దేరే ప్రదేశం, గమ్యస్థానం వంటి వివరాలు ఎంటర్ చేయాలి. అప్పుడు ఏ బస్సులు, సీట్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకుని, ఆన్‌లైన్, డిజిటిల్ చెల్లింపులు చేస్తే వాట్సాప్ నంబర్‌కు టికెట్ వస్తుంది.
వాట్సాప్ ద్వారా 161 సేవలు
దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ సేవల్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇటీవల మంత్రి నారా లోకేష్ దీని ద్వారా 161 ప్రభుత్వ సేవల్ని ప్రారంభించారు. మీరు వాట్సాప్ నెంబర్‌కు ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు.. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే మీకు సర్టిఫికెట్స్ సైతం ఆన్‌లైన్‌లోనే అందిస్తుంది ప్రభుత్వం. వాట్సాప్ గవర్నెన్స్ మొదటి విడతలో రెవెన్యూ, దేవాదాయ, ఏపీఎస్ఆర్టీసీ, ఎనర్జీ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి పలు శాఖల్లో సేవలను అందుబాటులోకి తెచ్చింది. రెండో దశలో 360 సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నారా లోకేష్ చొరవ తీసుకుని మెటా సంస్థతో గత ఏడాది అక్టోబర్ నెలలో చర్చలు జరిపి, ప్రాసెస్ మొదలుపెట్టారు. 'మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం' వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com