ASG: అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల

అదనపు సొలిసిటర్ జనరల్‌గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్‌ను కేంద్రం తాజాగా నియమించింది. కనకమేడలతో పాటు దవీందర్‌పాల్ సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కనకమేడల రవీంద్ర కుమార్ గతంలో తెలుగుదేశం పార్టీ తరుఫున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. రాజకీయాలతో పాటుగా న్యాయరంగంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కనకమేడల రవీంద్ర కుమార్‌ను సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్ర కుమార్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలపై కీలక పాత్ర పోషించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

