24 Jan 2021 6:51 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / కొవిడ్‌ టీకా...

కొవిడ్‌ టీకా వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి!

గుంటూరు జీజీహెచ్‌ లో ఆశా కార్యకర్త విజయలక్ష్మి చనిపోయింది. ఈ నెల 19 న ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. రెండు రోజులు బాగానే ఉంది.

కొవిడ్‌ టీకా వేయించుకున్న ఆశా వర్కర్‌ మృతి!
X

గుంటూరు జీజీహెచ్‌ లో ఆశా కార్యకర్త విజయలక్ష్మి చనిపోయింది. ఈ నెల 19 న ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. రెండు రోజులు బాగానే ఉంది. అయితే ఈనెల 21న తెల్లవారు జామునుంచి తీవ్రమైన చలి, జ్వరం రావడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలను కోల్పోయింది. కాగా, విజయలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశావర్కర్లు జీజీహెచ్‌ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story