IPL: ధ్యాంక్యూ ధోనీ.. అశ్విన్ ఎమోషనల్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు రవిచంద్రన్ అశ్విన్ సిద్ధమైపోయాడు. అయితే ధోనీ గురించి అశ్విన్ ఆసక్తికర విషయాన్ని పంచుకొన్నాడు. వందో టెస్టు సందర్భంగా బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అశ్విన్‌కు జ్ఞాపికను అందజేసింది. ఈ మెమొంటోను ధోనీ నుంచి అందుకోవాలని అశ్విన్ భావించినా అది సాధ్యపడలేదు. ఆ టెస్టుకు ధోనీ రాలేదు. ఇప్పుడు మాత్రం తనను సీఎస్కేకు మళ్లీ తీసుకొని ఇలాంటి మంచి బహుమతి ఇస్తాడని అనుకోలేదని.. ధోనీకి ధన్యవాదాలని అశ్విన్ అన్నాడు. తనవల్లే ఇక్కడున్నా అని... ఇప్పుడు ఆటను ఆస్వాదించాలని భావిస్తున్నానని అశ్విన్ వెల్లడించాడు.
చెన్నై జట్టులో మరీ ఇంత పోటీనా
ఐపీఎల్ తొలి మ్యాచుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. ఇప్పుడు చెన్నైను తుది జట్టు ఎంపిక సమస్య వేధిస్తోంది. తుది జట్టులో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, అశ్విన్ ఉన్నారు. ఇక మరో యువ స్పిన్నర్ నూర్ అహ్మద్‌కు అవకాశం ఇస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారనుంది. ఇక రచిన్ రవీంద్ర వంటి ఓపెనర్ కమ్ స్పిన్నర్ కూడా ఆ జట్టులో ఉన్నాడు. మార్చి 23న చెన్నై తొలి మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్ టికెట్ల జారీ ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టికెట్ల జారీ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఫిజికల్ టికెట్స్ జారీ చేయనున్నారు. సికింద్రాబాద్ జింఖానా స్టేడియం, ఈసీఐఎల్, గచ్చిబౌలి స్టేడియం, హిమాయత్ నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అత్తాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కాలిఫోర్నియా బురిటో రెస్టారెంట్లలో టికెట్లు అందించనున్నారు.
కోల్ కత్తాకు బిగ్ షాక్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షాక్ తగిలింది. పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియాను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. చేతన్‌కు కేకేఆర్ రూ.75 లక్షలు చెల్లించనుంది. కాగా 2021 నుంచి 2024 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉన్న ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com