ఏపీలో ఏఎస్సై రాసలీలలు..ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తే..అక్కడ రెండో సెటప్..!‌!

ఏపీలో ఏఎస్సై రాసలీలలు..ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తే..అక్కడ రెండో సెటప్..!‌!
అమాయక మహిళలే అతని టార్గెట్‌! ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తే... అక్కడ రెండో సెటప్ పెట్టేస్తాడు‌!

అమాయక మహిళలే అతని టార్గెట్‌! ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తే... అక్కడ రెండో సెటప్ పెట్టేస్తాడు‌! తన పోలీసు అధికారాన్ని ఉపయోగించుకుని మహిళల్ని లోబర్చుకుంటాడు! మోజు తీరాకా వదిలేస్తాడు! కానీ వారికి ఆస్తిపాస్తులున్నాయని తెలిస్తే... అందులో వాటా కావాలంటాడు! ఇది గుంటూరు జిల్లా గురజాల ఏఎస్సై వెంకట్రావు నైజం. ఆయన రాసలీలలు, అక్రమసంబంధాల బాగోతాల గురించి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే...ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది.

గురజాల ఎస్సైగా పనిచేస్తోన్న వెంకట్రావు.... పలువురు మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొదటి భార్య ఉండగానే.. ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమెపై మొదటి భార్య కోర్టులో పిటీషన్‌ వేసింది. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగా... దాచేపల్లికి చెందిన మరో మహిళతోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఏఎస్సై వెంకట్రావు. అయితే..ఇదే సమయంలో ఆమె భర్త కనిపించకుండా పోవడం అనుమాలకు తావిస్తోంది. దీన్ని ప్రశ్నించినందుకు.. ఆమె కుమారులపై బెదిరింపులకు దిగుతున్నాడు వెంకట్రావు. అంతేకాదు ఆమె చనిపోవడంతో.... ఆమె ఆస్తులపై కన్నేసిన వెంకట్రావు..... వాటా కావాలంటూ... ఆమె కుమారుల్ని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కోర్టు నుంచి నోటీసులు కూడా పంపాడు.

తన తండ్రి కనిపించకుండా పోవడంతో పాటు తమ ఆస్తుల్లో వాటా అడుగుతున్న వెంకట్రావు అరాచాకాల గురించి.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు మహిళ కుమారులు. ఏఎస్సై వెంకట్రావే తన తండ్రికి హానీ కలిగించాడని అనుమానం ఉందని, తన తండ్రి గురించి విచారణ చేయాలని, వెంకట్రావు నుంచి రక్షణ కావాలని విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీని వేడుకుంటున్నారు.

Tags

Next Story