ASSEMBLY: కోర్టుకు వెళ్లినా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం

ASSEMBLY: కోర్టుకు వెళ్లినా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం
X
స్పష్టం చేసిన స్పీకర్ అయన్నపాత్రుడు... ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పష్టీకరణ... కోర్టుకు వెళ్లినా ప్రతిపక్ష ఇవ్వలేమన్న స్పీకర్

వై­సీ­పీ అధి­నేత, మాజీ ము­ఖ్య­మం­త్రి జగన్.. ప్ర­జల పట్ల బా­ధ్యత లే­కుం­డా వ్య­వ­హ­రి­స్తూ ప్ర­తి­ప­క్ష హోదా అడు­గు­తు­న్నా­ర­ని స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఏపీ­లో శాం­తి భద్ర­తల అం­శం­పై చర్చ సం­ద­ర్భం­గా స్పీ­క­ర్ మా­ట్లా­డా­రు. వై­సీ­పీ నే­త­లు ఇటీ­వల చే­స్తు­న్న ‘రప్పా రప్పా’ డై­లా­గు­ల­పై ఆగ్ర­హం వె­లి­బు­చ్చా­రు. ఎన్టీ­ఆ­ర్ హయాం నుం­చి తాము రా­జ­కీ­యా­ల్లో ఉన్నా­మ­ని.. గతం­లో ఎన్న­డూ ఇలాం­టి పరి­స్థి­తి లే­ద­ని స్పీ­క­ర్ అన్నా­రు. వై­సీ­పీ సభ్యు­లు సభకు రా­కుం­డా­నే ప్ర­శ్న­లు పం­పిం­చ­డం­పై అభ్యం­త­రం వ్య­క్తం చే­శా­రు. గతం­లో గౌతు లచ్చ­న్న పా­ర్టీ తర­ఫున 64 మంది ఎన్ని­కై­తే ప్ర­తి­ప­క్ష హోదా ఇచ్చా­ర­ని.. అయి­తే సభ్యు­లు కొం­ద­రు పా­ర్టీ మా­రిన నే­ప­థ్యం­లో ఆయన ప్ర­తి­ప­క్ష హో­దా­ను స్వ­యం­గా వదు­లు­కు­న్నా­ర­ని గు­ర్తు చే­శా­రు. జగన్ మా­త్రం సం­ఖ్యా­బ­లం లే­కు­న్నా ప్ర­తి­ప­క్ష హోదా అడ­గ­ట­మేం­ట­ని ప్ర­శ్నిం­చా­రు. ప్ర­తి­ప­క్ష హోదా ఇవ్వ­డం కు­ద­ర­ద­ని స్పీ­క­ర్ అయ్య­న్న పా­త్రు­డు తే­ల్చి చె­ప్పా­రు. జగన్ కో­ర్టు­కు వె­ళ్లి­నా ఫలి­తం ఉం­డ­ద­ని స్ప­ష్టం చే­శా­రు. దే­వు­డే వరం ఇవ్వ­న­ప్పు­డు, తాను ఏం చే­య­గ­ల­న­ని ప్ర­శ్నిం­చా­రు. జగన్ అసెం­బ్లీ­కి వచ్చి ప్ర­జల సమ­స్య­ల­పై మా­ట్లా­డా­ల­ని హి­త­వు పలి­కా­రు. వై­సీ­పీ నే­త­లు కో­ర్టు­కు వె­ళ్లి­నా సరే జగ­న్‌­కు మా­త్రం ప్ర­తి­ప­క్ష హోదా ఇవ్వ­డం కు­ద­ర­ద­ని కుం­డ­బ­ద్ధ­లు కొ­ట్టి చె­ప్పే­శా­రు.

నేను పూజారిని మాత్రమే..

దే­వా­ల­యం­లో తాను ఒక పూ­జా­రి­ని మా­త్ర­మే­న­ని.. దే­వు­డే వై­ఎ­స్ జగ­న్‌­కు వరం ఇవ్వ­లే­ద­ని ఎద్దే­వా చే­శా­రు. అప్పు­డు పూ­జా­రి­ని అయిన తాను మా­త్రం ఏం చే­య­గ­ల­న­ని ఆయన ప్ర­శ్నిం­చా­రు. స్పీ­క­ర్‌­గా తాను చట్ట ప్ర­కా­ర­మే నడు­చు­కుం­టా­న­ని అయ్య­న్న­పా­త్రు­డు స్ప­ష్టం చే­శా­రు. వై­ఎ­స్ జగన్ అసెం­బ్లీ­కి వచ్చి ప్ర­జా సమ­స్య­ల­పై మా­ట్లా­డా­ల­ని ఈ సం­ద­ర్భం­గా అయ్య­న్న పా­త్రు­డు సూ­చిం­చా­రు. సభకు రా­కుం­డా కొం­ద­రు వై­సీ­పీ ఎమ్మె­ల్యే­లు సభకు వచ్చి­న­ట్టు సం­త­కా­లు పె­ట్టి వె­ళ్తు­న్నా­ర­ని వారి సం­గ­తి చూ­డా­ల­ని ప్రి­వి­లే­జ్‌ కమి­టీ­కి సి­ఫా­ర్సు చే­శా­రు. దీ­ని­పై వి­చా­రణ సా­గు­తు­న్న వేళ జగన్ సు­ప్రీం­కో­ర్టు­ను ఆశ్ర­యిం­చా­రు. ప్ర­తి­ప­క్ష హో­దా­పై హై­కో­ర్టు, సు­ప్రీం­కో­ర్టు­కు జగన్ వె­ళ్ల­డం­పై స్పీ­క­ర్ అయ్య­న్న పా­త్రు­డు కీలక కా­మెం­ట్స్ చే­శా­రు. ప్ర­జా­స్వా­మ్యం­లో అం­తిమ ని­ర్ణే­త­లు ప్ర­జ­లే­న­ని అన్నా­రు. అలాం­టి ప్ర­జ­లే జగ­న్‌­కు ప్ర­తి­ప­క్ష హోదా ఇవ్వ­లే­ద­ని గు­ర్తు చే­శా­రు. కే­వ­లం 11 సీ­ట్లు మా­త్ర­మే ఇచ్చా­ర­ని ఈ పరి­స్థి­తు­ల్లో తాను ఏం చే­య­లే­న­ని చె­ప్పు­కొ­చ్చా­రు. రూ­ల్స్‌­ను గత సం­ప్ర­దా­యా­ల­ను అను­స­రిం­చే తాను ఏదై­నా ని­ర్ణ­యం తీ­సు­కో­గ­ల­న­ని స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు అన్నా­రు.

Tags

Next Story