PERNI NANI: పోలీస్‌స్టేషన్‌లో పేర్ని నాని దాదాగిరి

PERNI NANI: పోలీస్‌స్టేషన్‌లో పేర్ని నాని దాదాగిరి
X
పేర్ని నానిపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం

మాజీ మం­త్రి, వై­సీ­పీ నేత పే­ర్ని నాని మచి­లీ­ప­ట్నం పో­లీ­స్‌ స్టే­ష­న్‌­లో దా­దా­గి­రి ప్ర­ద­ర్శిం­చ­డం తీ­వ్ర వి­మ­ర్శ­ల­కు దారి తీ­సిం­ది. ఇటీ­వల పే­ర్ని నాని నే­తృ­త్వం­లో వై­సీ­పీ శ్రే­ణు­లు మె­డి­క­ల్‌ కా­లే­జీ వద్ద ని­ర­సన చే­ప­ట్టా­యి. అను­మ­తి లే­కుం­డా ని­ర­సన కా­ర్య­క్ర­మం చే­ప­ట్ట­డం­తో పే­ర్ని­తో పాటు 400 మం­ది­కి పో­లీ­సు­లు 41ఏ నో­టీ­సు­లు ఇచ్చా­రు. పో­లీ­సుల నో­టీ­సు­ల­కు సమా­ధా­నం ఇవ్వొ­ద్ద­ని వై­సీ­పీ మచి­లీ­ప­ట్నం అధ్య­క్షు­డు మేకల సు­బ్బ­న్న పా­ర్టీ వా­ట్స­ప్‌ గ్రూ­ప్‌­లో పో­స్టు చే­శా­రు. కేసు వి­చా­ర­ణ­లో భా­గం­గా సు­బ్బ­న్న­ను పో­లీ­సు­లు స్టే­ష­న్‌­కు పి­లి­పిం­చా­రు. వి­ష­యం తె­లు­సు­కు­న్న పే­ర్ని­నా­ని కా­ర్య­క­ర్త­ల­తో కలి­సి పో­లీ­స్‌ స్టే­ష­న్‌­కు చే­రు­కు­ని.. ఆర్‌­పేట సీ­ఐ­తో వా­గ్వా­దా­ని­కి ది­గా­రు. తమ పా­ర్టీ కా­ర్య­క­ర్త­ల­ను స్టే­ష­న్‌­కు ఎం­దు­కు పి­లు­స్తు­న్నా­ర­ని ఆగ్ర­హం­తో రె­చ్చి­పో­యా­రు. పో­లీ­సు­ల­తో దు­రు­సు­గా ప్ర­వ­ర్తిం­చా­రు. పే­ర్ని నాని వ్య­వ­హార శై­లి­తో వి­స్తు­పో­యిన పో­లీ­సు­లు.. స్టే­ష­న్ నుం­చి వె­ళ్లి­పో­వా­ల­ని సూ­చిం­చా­రు.

పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తప్పవు

ఆర్‌పేట సీఐ విధులకు ఆటంకం కలిగించేలా మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీ నిరసన కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకోవడానికి వచ్చి, సీఐని బెదిరించడం, దురుసుగా మాట్లాడటం సరికాదని ఎస్పీ ఖండించారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags

Next Story