AU: శాంతించిన ఏయూ విద్యార్థులు..ఆందోళన విరమణ

AU: శాంతించిన ఏయూ విద్యార్థులు..ఆందోళన విరమణ
X
విద్యార్థి మృతిపై భగ్గుమన్న ఏయూ.. రెండు రోజులుగా విద్యార్థుల ఆందోళన... వీసీ రాజీనామాకు విద్యార్థుల పట్టు

వి­ద్యా­ర్థి మృ­తి­తో రెం­డు రో­జు­లు­గా రణ­రం­గం­గా మా­రిన ఆం­ధ్రా యూ­ని­వ­ర్సి­టీ­లో ప్ర­స్తు­తం ప్ర­శాం­తం­గా మా­రిం­ది. వి­ద్యా­ర్థి సం­ఘా­లు, ఏయూ వైస్ ఛా­న­ల్స­ర్‌ రా­జ­శే­ఖ­ర్ తో జరి­గిన చర్చ­లు ఫలిం­చా­యి. తమ సమ­స్య­లు పరి­ష్క­రిం­చా­లం­టూ ఏయూ వర్సి­టీ ఎదుట వి­ద్యా­ర్థు­లు ఆం­దో­ళన ని­ర్వ­హిం­చా­రు. . ఆ సమ­యం­లో వీసీ రా­జ­శే­ఖ­ర్ అక్క­డి­కి వచ్చిన వీ­సీ­కి వ్య­తి­రే­కం­గా ని­నా­దా­లు చే­శా­రు. ఏయూ శా­త­వా­హన హా­స్ట­ల్ వి­ద్యా­ర్థి మణి­కంఠ మృ­తి­కి వర్సి­టీ డి­స్పె­న్స­రీ­లో సరైన సౌ­క­ర్యా­లు లే­క­పో­వ­డ­మే­న­ని ని­నా­దా­లు చే­శా­రు. దీం­తో వా­రి­ని పో­లీ­సు­లు అడ్డు­కో­వ­డం­తో పరి­స్థి­తి ఉద్రి­క్తం­గా మా­రిం­ది.

వర్సి­టీ­లో చాలా సమ­స్య­లు ఉన్నా­య­ని, ఇప్ప­టి­కై­నా పరి­ష్క­రిం­చా­ల­ని వి­ద్యా­ర్థు­లు డి­మాం­డ్ చే­శా­రు. చి­వ­ర­కు ఈ వి­ష­యం­పై అటు ప్ర­భు­త్వం కూడా స్పం­దిం­చిం­ది. వి­ద్యా­ర్థి మృ­తి­పై రా­జ­కీ­యం చే­యొ­ద్ద­ని సూ­చిం­చిం­ది. వి­ద్యా­ర్థు­ల­తో తాము చర్చ­ల­కు రెడీ అని తె­లి­పిం­ది. మరో­వై­పు వీసీ రా­జ­శే­ఖ­ర్ సైతం వి­ద్యా­ర్థు­ల­తో చర్చ­లు జరి­పా­రు. రెం­డు రో­జు­ల్లో సమ­స్య­లు పరి­ష్క­రి­స్తా­మ­ని హామీ ఇచ్చా­రు. దీం­తో వి­ద్యా­ర్థు­లు శాం­తిం­చా­రు. ఆం­దో­ళ­న­ను వి­ర­మిం­చా­రు. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రా యూనివర్సిటీలో కనీస వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ కల్పించక పోవడం వల్లే బీఎడ్ విద్యార్థి మణికంఠ మృతి చెందాడని తీవ్ర ఆగ్రహ జ్వలలు వెల్లు వెత్తాయి. స్టూడెంట్ మృతికి బాధ్యత వహిస్తూ వీసి రాజీనామా చేయాలనీ విద్యార్థులంతా డిమాండ్ చేశారు.. పరిస్థితులు చేయి దాటి పోవడంతో భారీగా పోలీసులు మొహరించారు.. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళనలో వెనక్కి తగ్గలేదు.. వీసీ ఛాంబర్ ను ముట్టడించి న్యాయం కోసం డిమాండ్ చేశారు. దీంతో ఆంధ్ర యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు, అసెంబ్లీలో ఏయూ ఇష్యూపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. నిన్న ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్ధి ఫిట్స్ వచ్చి చనిపోయారని తెలిపారు.. అయితే, అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం అన్నారు.

Tags

Next Story