Andhra University: లైంగిక ఆరోపణలను ఖండించిన ప్రొఫెసర్

విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నల్లా సత్యనారాయణ.. ఓ స్కాలర్‌ను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. పరిశోధన పూర్తి చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రొఫెసర్ లైంగిక వేధింపులు తాళలేక ఆయనపై బాధితురాలు త్రీటౌన్ పోలీసులు, ఏయూ వీసీ, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నల్లా సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు తనపై ఆరోపణల్ని ఖండించారు ప్రొఫెసర్ నల్లా సత్యనారాయణ. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు. రూల్స్‌కు విరుద్దంగా Phd ఇవ్వనందుకే సొనాలి ఇలాంటి ఆరోపణలు చేసిందన్నారు. యూనివర్శిటిలో పీహెచ్ డీలు అంగట్లో సరుకుగా మారిపోయాయని, ఎగ్జిక్యూటివ్ కోటాలో ఎవరికి పడితే వారికి PhDలు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఏయూ పాలకమండలి రాజకీయ పునరావాసంగా మారిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు సైతం వెళ్తానని గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేస్తానంటున్నారు నల్లా సత్యనారాయణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com