AYESHA MEERA: ఆయేషా మీరా కేసు క్లోజ్‌..! ముగిసిన 17 ఏళ్ల పోరాటం

AYESHA MEERA: ఆయేషా మీరా కేసు క్లోజ్‌..! ముగిసిన 17 ఏళ్ల పోరాటం
X
ముగిసిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ... 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేసు క్లోజ్... కీలక ఆదేశాలు ఇచ్చిన సీబీఐ కోర్టు.. ఈ నెల 27న అవశేషాలకు అంత్యక్రియలు

పెను సం­చ­ల­నం సృ­ష్టిం­చిన బీ ఫా­ర్మ­సీ వి­ద్యా­ర్థి­ని ఆయే­షా మీరా హత్య కేసు అధి­కా­రి­కం­గా ము­గి­సిం­ది. సు­మా­రు 17 ఏళ్ల పాటు ఎన్నో మలు­పు­లు తి­రి­గిన ఈ కే­సు­లో అసలు దోషి ఎవరో తే­ల్చ­లేక సీ­బీఐ చే­తు­లె­త్తే­య­డం­తో న్యా­య­స్థా­నం ఈ కే­సు­ను మూ­సి­వే­స్తూ సం­చ­ల­నం ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. వి­జ­య­వా­డ­లో­ని సీ­బీఐ ప్ర­త్యేక కో­ర్టు న్యా­యా­ధి­కా­రి అన్న­పూ­ర్ణ ఈ మే­ర­కు శు­క్ర­వా­రం తుది ఉత్త­ర్వు­లు జారీ చే­శా­రు. సీ­బీఐ సమ­ర్పిం­చిన క్లో­జ్ రి­పో­ర్ట్‌­ను పరి­శీ­లిం­చిన వి­జ­య­వాడ సీ­బీఐ ప్ర­త్యేక కో­ర్టు న్యా­య­మూ­ర్తి అన్న­పూ­ర్ణ కే­సు­ను అధి­కా­రి­కం­గా మూ­సి­వే­స్తూ ఉత్త­ర్వు­లు జారీ చే­శా­రు. దోషి తే­ల­కుం­డా­నే కేసు ము­గి­య­డం బా­ధా­క­ర­మ­ని అనేక వర్గా­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­యి.

ఇక మరో­వై­పు, రీ-పో­స్టు­మా­ర్టం కోసం వె­లి­కి­తీ­సిన తమ కు­మా­ర్తె అవ­శే­షా­ల­ను తమకు అప్ప­గిం­చా­ల­ని ఆయే­షా తల్లి­దం­డ్రు­లు పి­టి­ష­న్ దా­ఖ­లు చే­శా­రు. తమకు న్యా­యం దక్క­క­పో­యి­నా, కనీ­సం మతా­చా­రాల ప్ర­కా­రం అం­త్య­క్రి­య­లు ని­ర్వ­హిం­చు­కో­వా­ల­న్న­ది వారి వి­న్న­పం. దీ­ని­పై స్పం­దిం­చిన సీ­బీఐ కో­ర్టు ఈ నెల 27న ఉదయం 10 గం­ట­ల­కు అవ­శే­షా­ల­ను అధి­కా­రి­కం­గా అప్ప­గిం­చా­ల­ని ఆదే­శిం­చిం­ది. గు­ర్తిం­పు పం­చ­నా­మా ని­ర్వ­హిం­చిన అనం­త­రం భద్ర­తా ఏర్పా­ట్ల మధ్య ప్ర­భు­త్వ వా­హ­నం­లో అవ­శే­షా­ల­ను తె­నా­లి­కి తర­లిం­చి, ము­స్లిం మతా­చా­రాల ప్ర­కా­రం గౌ­ర­వ­ప్ర­దం­గా అం­త్య­క్రి­య­లు ని­ర్వ­హిం­చేం­దు­కు అను­మ­తి ఇచ్చిం­ది. మొ­త్తం ప్ర­క్రి­య­ను వీ­డి­యో రి­కా­ర్డు చేసి ని­వే­ది­క­ను కో­ర్టు­కు సమ­ర్పిం­చా­ల­ని కూడా స్ప­ష్టం చే­సిం­ది.

ఆయేషా తల్లి శంషాద్ బేగం ఏళ్ల తరబడి న్యాయం కోసం పోరాడారు. అయితే సీబీఐ కూడా నిందితులను గుర్తించలేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. సీబీఐ క్లోజ్ రిపోర్ట్‌పై తాము ఎలాంటి ప్రొటెస్ట్ పిటిషన్ గానీ, ప్రైవేట్ కేసు గానీ వేయబోమని కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా సాగిన ఈ కేసు అధికారికంగా ముగిసింది. రీ పోస్టుమార్టం కోసం తీసుకున్న ఆయేషా శరీర అవశేషాలను తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు, ఈ నెల 27 తేదీని ఉదయం 10 గంటలకు అప్పగించాలని ఆదేశించింది. న్యాయస్థానంలో గుర్తింపు పంచనామా నిర్వహించిన తర్వాతే అవశేషాలను అప్పగించాలని పేర్కొంది. తగిన భద్రతతో ప్రభుత్వ వాహనంలో అవశేషాలను స్వస్థలమైన తెనాలికి తరలించారని పేర్కొంది. అక్కడ వారి మతాచారం ప్రకారం గౌర ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేలా అధికారులు సహకరించాలని సూచించింది. మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరించాలని పేర్కొంది. ఆయేషా మీరా హత్య కేసు అనేక దర్యాప్తు సంస్థలు మారినా, అనేక విచారణలు జరిగినా, అసలు నేరస్థుడు ఎవరో తేలకుండానే ముగియడం న్యాయవ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆమెకు మతాచారాల ప్రకారం అంతిమ వీడ్కోలు లభించనుంది.

Tags

Next Story