విశాఖ పార్లమెంట్‌కు ఉపఎన్నిక పెట్టి తేల్చుకుందామా..
విశాఖపట్టణమే రాజధానా అనే అంశంపై అసెంబ్లీ రద్దు చేయాలని చంద్రబాబు కోరితే.. సీఎం జగన్ పారిపోయారని..

రాజధాని అంశంపై విశాఖ పార్లమెంట్‌లో ఉపఎన్నిక పెట్టి తేల్చుకుందామా అని సవాల్ విసరారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. దీనికి మంత్రి ధర్మాన సిద్ధమా అని ప్రశ్నించారు. అమరావతియే రాజధానా? విశాఖపట్టణమే రాజధానా అనే అంశంపై అసెంబ్లీ రద్దు చేయాలని చంద్రబాబు కోరితే.. సీఎం జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు విశాఖ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి అక్కడ ఒక్క చోటే ఉపఎన్నికకు వెళ్దామన్నారు అయ్యన్నపాత్రుడు. ప్రజల ఉద్దేశమేంటో అప్పుడు తెలిసిపోతుందన్నారు. సవాల్‌కు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కొద్దిరోజులుగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. దీంతో ఏపీ రాజకీయాల్లో సవాళ్ల పర్వం నడుస్తోంది.
Next Story