మంత్రి జయారాంపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయనున్న అయ్యన్నపాత్రుడు

మంత్రి జయారాంపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయనున్న అయ్యన్నపాత్రుడు

మంత్రి గుమ్మనూరు జయారాంపై అవినీతి నిరోధక శాఖలో ఫిర్యాదు చేయనున్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. విశాఖపట్నంలోని ఏసీబీ ఆఫీస్‌కి నేరుగా వెళ్లి కంప్లైంట్ చేయనున్నారు. ఈనెల 18నే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే నేరుగా తన వద్ద ఆధారాల్ని తీసుకుని కార్యాలయానికి వెళ్తున్నానని అంటున్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో మంత్రి జయరాం పాత్రపై పూర్తి విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

ESI స్కామ్‌లో A-14 నిందితుడు కార్తీక్‌తో మంత్రి కుమారుడు ఈశ్వర్‌కి లింకులున్నాయనేది తెలుగుదేశం నేతల ఆరోపణ. ఈశ్వర్ పుట్టిన రోజుకు కార్తీక్ నుంచి బెంజ్‌ కార్ గిఫ్ట్‌గా వెళ్లిందంటూ ఆధారాలు చూపిస్తున్నారు. జయరాంను కేబినెట్ నుంచి తప్పించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు ACBకి అయ్యన్న ఫిర్యాదు చేస్తుండడంతో తర్వాత ఏం జరుగుతుంది, ఏసీబీ అధికారులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిరేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story