లిక్కర్ స్కాంలో మాగుంటకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ మాగుంట కుమారుడు రాఘవకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు.శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడంతో రాఘవకు ఊరట లభించినట్లు అయింది. షరతులతో కూడిన రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది కోర్టు. గత ఏప్రిల్ 6న మాగుంట రాఘవ, ఆయన సంస్థలపై ఈడీ ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం కోసం ఈయన భారీగా లాబీయింగ్ చేసినట్లు అభియోగం మోపింది ఈడీ.
ఎయిర్‌పోర్టు జోన్‌లో వ్యాపారం కోసం వైసీపీ మాగుంట కుటుంబం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసిందని ఈడీ తన అభియోగపత్రంలో పేర్కొంది. ఎయిర్‌పోర్టు జోన్ విషయంలో మాగుంట కుటుంబానికి మనీష్ సిసోడియా సాయం చేశారని ఈడీ చెప్పింది.. ఇండో స్పిరిట్ కంపెనీలో 75 శాతం వాటా కావాలని కోరారని.. ఇండో స్పిరిట్ కంపెనీలో తాను రాఘవ తరపున డమ్మీనని ప్రేమ్ రాహుల్ చెప్పినట్లుగా ఈడీ ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com