Balakrishna: ఎన్టీఆర్ పేరు మార్పుపై ఘాటుగా స్పందించిన హీరో బాలకృష్ణ

Balakrishna : ఎన్టీఆర్ పేరు మార్పుపై ఘాటుగా స్పందించారు హీరో బాలకృష్ణ. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నుముక అంటూ కామెంట్ చేశారు. జగన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తూ బాలకృష్ణ ట్వీట్ చేశారు. తండ్రి గద్దెనెక్కిన తర్వాత ఎయిర్‌పోర్ట్ పేరు మార్చారని, కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు ఉన్నారని, పంచభూతాలు సైతం ఉన్నాయ్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
వైసీపీలో కూడా మహనీయుడు పెట్టిన రాజకీయ భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నారని, విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని కామెంట్ చేశారు. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ పేరు మార్పుపై ఘాటుగా స్పందించిన హీరో బాలకృష్ణ
మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు..
ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నుముక: బాలకృష్ణ
తండ్రి గద్దెనెక్కిన తర్వాత ఎయిర్‌పోర్ట్ పేరు మార్చారు
కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని తీవ్ర ఆగ్రహం
జగన్ ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు, పంచభూతాలున్నాయ్.. జాగ్రత్త
మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పీతలున్నారు
విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్: బాలకృష్ణ
శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు: బాలకృష్ణ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com