కోడెల శివ ప్రసాద్‌ చిత్రపటానికి బాలకృష్ణ నివాళులు

కోడెల శివ ప్రసాద్‌ చిత్రపటానికి బాలకృష్ణ నివాళులు
క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలో కోడెల సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి : బాలకృష్ణ

కోడెల శివ ప్రసాద రావు చిత్రపటానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. కోడెల శివ ప్రసాద రావు మొదటి వర్ధంతి సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో శివప్రసాద్ సంస్మరణ సభ నిర్వహించారు. పార్టీలో చేరినప్పటి నంచి సమాజానికి సేవ చేయాలనే తపన, చేపట్టిన కార్యక్రమాలు ఆయనను చిరస్మరణీయంగా నిలిపాయన్నారు బాలకృష్ణ. నిబద్ధత కలిగిన కార్యకర్తగా నాయకుడిగా కీలక పాత్ర పోషించారని కొనియడారు. క్యాన్సర్ హాస్పిటల్ స్థాపనలోనూ కోడెల శివ ప్రసాద్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు బాలకృష్ణ.

Tags

Read MoreRead Less
Next Story