BANAKACHARLA: బనకచర్ల పేరిట ప్రాంతీయ విద్వేషాలు: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు సృష్టిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. మిగులు జలాలు వాడుకుంటామంటే అభ్యంతరం చెబుతున్నారని.. కాళేశ్వరం కట్టేముందు అనుమతులున్నాయా అని లోకేష్ నిలదీశారు. దిగువ రాష్ట్రంలో ప్రాజెక్ట్ కడితే.... ఎగువ రాష్ట్రానికి అభ్యంతరమేంటని లోకేశ్ ప్రశ్నించారు.
లోకేష్ పై అద్దంకి ఫైర్
నారా లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య.. వివాదాలు సృష్టించేలా ఉన్నాయని అద్దంకి దయాకర్ అన్నారు. ఇలాంటి ప్రకటనలు ఇరు రాష్ట్రాలకు మంచిది కాదన్న ఆయన... రెండురాష్ట్రాల మధ్య సఖ్యత కోసం తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి చూస్తున్నామని అద్దంకి తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల విషయంలో చాలా రోజులుగా రగడ జరుగుతోంది. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో కట్టనియ్యబోమని రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. కేసీఆర్ కూడా మరో నీటి ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటివరకూ ఏపీ నుంచి ఏ నేత కూడా బనకచర్లపై ఇంతటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిని రాజేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మిస్తామని గట్టిగా చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com