విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక

భారీ వర్షాలు, ఈదురు గాలులతో విశాఖ తీరానికి ఓ షిప్ కొట్టుకొచ్చింది. తెన్నేటి పార్క్ సమీప తీరానికి కార్గో నౌక చేరుకుంది. వాయుగుండం కారణంగా గత కొద్దిరోజులుగా సముద్రంలో భారీగా అలలు చెలరేగడంతో షిప్ ఒడ్డుకు చేరుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన భారీ ఓడ ఒడ్డుకు కొట్టుకు రావడంతో... సముద్రంలో వాయుగుండం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుందని మత్స్యకారులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story