Suicide: అధికారుల 'టార్గెట్' తో.. బ్యాంక్ మేనేజర్ బలవన్మరణం

Suicide: ఒత్తిడితో మానసిక వేదనకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. అయినా అధికారుల్లో మార్పు రావట్లేదు. టార్గెట్లు రీచ్ అవ్వాలంటూ ఉద్యోగస్తుల మీద భారాన్ని మోపుతుంటారు.సెన్సిటివ్ మెంటాలిటీ ఉన్నవాళ్లు దాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కాకినాడ యానాంకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ ఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది.
బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ కాకపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దాంతో కొన్ని అప్పులు తానే తీర్చాడు. అయినా ఇంకా మిగిలి ఉన్నాయి. ఇంతకు ముందు మచిలీపట్నం బ్రాంచిలో మేనేజరుగా పని చేసి ట్రాన్స్‌ఫర్ మీద యానాం వచ్చారు. అక్కడ కూడా నిర్ధేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేశారు. కానీ తిరిగి వసూలు చేయలేకపోయారు. దీంతో రూ.60 లక్షల వరకు ఆయనే చెల్లించాల్సి వచ్చింది.
అయినా ఇంకా కొంత అప్పు మిగిలిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దాదాపు రూ.37 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈలోపే ఒత్తిడి భరించలేని శ్రీకాంత్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న శ్రీకాంత్ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. భార్య గాయత్రి మంగళవారం ఉదయం పిల్లలను స్కూలుకు తీసుకుని వెళ్లారు.
తిరిగి వచ్చిన గాయత్రి ఎన్ని సార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీలోనుంచి లోపలికి చూడగా.. భర్త శ్రీకాంత్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. పోలీసుల ఎంక్వైరీలో అథికారుల ఒత్తిడి కారణంగానే అతడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. అప్పులు త్వరలోనే తీరిపోతాయని చెప్పిన భర్త ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో గాయత్రి కన్నీరు మున్నీరవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com