Bengal Tiger : అనకాపల్లిని వణికిస్తున్న బెంగాల్ టైగర్..

Bengal Tigers : అనకాపల్లి జిల్లా వాసులను బెంగాల్ టైగర్ వణికిస్తోంది. సబ్బవరం మండలంలో తాజాగా పెద్దపులి సంచారం తీవ్రకలకలం రేపుతోంది. ఎల్లుప్పి గ్రామంలో పెద్దపులి బీభత్సం సృష్టించింది. నల్గొకొండ అటవీప్రాంతంలోని రైతు కొట్యాడ అప్పలరాము కల్లం వద్ద రెండు ఆవులపై దాడి చేసింది. ఒక గేదెపై దాడిచేసి చంపేసింది. ఒక ఆవును చంపేసిన .. దాన్ని నోటకరుచుకొని అడవిలోకి ఈడ్చుకెళ్లినట్లు రైతు అప్పలరాము తెలిపారు.
ఈ గ్రామం కొండను ఆనుకొని ఉండటంతో పులి అక్కడ మకాం వేసినట్లు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పెద్దపులి అడుగులను పరిశీలించారు. దాని అడుగులను గుర్తించి.. పశువులపై పెద్దపులి దాడిచేసినట్లు పేర్కొన్నారు. పెద్దపులిని బందించేందుకు బోను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com