BHOGI: భోగి మంటలతో కళకళలాడుతున్న పల్లెలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ పండగకు సోమవారం భోగి మంటలతో పల్లెలు ఆహ్వానం పలుకుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు మొత్తం సందడిగా భోగి మంటల చుట్టూ చిన్నా పెద్దా ఆడిపాడుతూ ఆనందిస్తున్నారు. సంక్రాంతి సుఖసంతోషాలను కోరుకునే భోగి మంటలు తెలుగు లోగిళ్లతో కొత్త వెలుగులు నింపాయి. ఈ ఉత్తరాయణంలో తమకు సుఖసంతోషాలు కలగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
'భోగి' పండుగ ఇలా వచ్చిందట'
'భోగి' అనే పదం సంస్కృతం నుంచి వచ్చిన 'భుగ్' అనే పదం నుంచి ఉత్పన్నమైంది. భోగం అనేది పవిత్రమైనది అని భావిస్తారు. పురాణాలలో చెప్పినట్టుగా ఈ రోజున గోదా దేవి శ్రీరంగనాథ స్వామిలో కలిసిపోయి భోగాన్ని పొందిందట. అలాగే విష్ణువు వామనావతారంలో బలిని పాతాళానికి అణచివేశాడట. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను రక్షించాడని కథ ఉంటుంది. ఈ సంఘటనలకు ప్రతీకగా భోగి పండుగ జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.
భోగి రోజున ఈ పనులు చేయకండి!
భోగి మంటలను పవిత్రంగా కొలుస్తారు. కొన్ని పనులు చేయవద్దని పండితులు చెబుతున్నారు. పాదరక్షలు ధరించి భోగి మంటలకు ప్రదక్షణ చేయవద్దు.. ఇలా చేస్తే ప్రతికూల శక్తి ప్రభావం కలిగి ఉంటుంది. ఎంగిలి చేసిన ప్రసాదాన్ని అగ్నిలో వేయవద్దు. ఇలా చేస్తే అశుభ ఫలితాలు వస్తాయి. ఎవరినీ అవమానించవద్దు. ఎవరినీ నొప్పించవద్దు. ఇలా చేస్తే దేవతలకు కోపం వస్తుందట. అలాగే భోగి మంటల వద్ద పిల్లలను పర్యవేక్షిస్తూ ఉండండి.
ఆనందోత్సాహాల మధ్య భోగిమంటలు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం రేపు జాపన ప్రజలు భోగి మంటలు సరదాగా వేసుకున్నారు. ఓవైపు ఉదయం 5 గంటల నుండి వర్షం ప్రారంభమైన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భోగిమంటలు వేయడం జరిగింది. భోగి పండుగ నాడు ఎప్పుడు వర్షం రాలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఈసారి భోగి పండగ రోజు ఉదయాన్నే వర్షం రావడంతో అయినా సరే లెక్కచేయకుండా పిల్లాపాపలతో కుటుంబ సభ్యులతో భోగి మంటలు వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com