బిగ్ బ్రేకింగ్.. పంచాయితీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్ట్

బిగ్ బ్రేకింగ్.. పంచాయితీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్ట్
ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికిన సుప్రీంకోర్ట్

పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. యథావిధిగా ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు వాయిదా కోరుతూ ఈ నెల 21నే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ సుప్రీంలో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికల వాయిదా కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో ఒక భాగమే కదా అని వ్యాఖ్యానించింది.

Tags

Next Story