LOKESH: విశాఖ వేదికగా అతిపెద్ద కెరీర్ ఫెయిర్

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. విశాఖలోని గీతం యూనివర్శిటీలో అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 49 అగ్రశ్రేణి ఐటీ, ఐటీఏఎస్ కంపెనీలతో కలిపి 10,000కు పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు నారా లోకేశ్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మార్చి 5, 6వ తేదీల్లో ఫెయిర్ ఉంటుందని.. 3వ తేదీ లోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. 2004, 2025 పాస్‌అవుట్ విద్యార్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ మార్చి 5, 6 తేదీల్లో ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌తో కలిసి ఈ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికగా ఈ కెరీర్ ఫెయిర్ సాగుతుంది. అభ్యర్థులు మార్చి 3లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ అవకాశాన్ని యువత మిస్ చేసుకోవద్దని లోకేశ్ సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com