BILL GATES: ముగిసిన బిల్ గేట్స్ అమరావతి పర్యటన

BILL GATES: ముగిసిన బిల్ గేట్స్ అమరావతి పర్యటన
X
పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశం... ముగిసిన పర్యటన.. గేట్స్‌కు లోకేశ్ వీడ్కోలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు వి­జ­న్‌­కు గే­ట్స్ ఫౌం­డే­ష­న్ వ్య­వ­స్థా­పక ఛై­ర్మ­న్ బిల్ గే­ట్స్ జై కొ­ట్టా­రు. టె­క్నా­ల­జీ ఆధా­రిత పాలన, డి­జి­ట­ల్ ప్ర­జా­సే­వ­లు, ఆరో­గ్య రం­గం­లో ఆవి­ష్క­ర­ణ­ల­పై రా­ష్ట్ర ప్ర­భు­త్వం చే­ప­ట్టిన చర్య­ల­ను ఆయన ప్ర­శం­సిం­చా­రు. సో­మ­వా­రం జరి­గిన ఆయన ఏపీ పర్య­టన కీ­ల­కం­గా మా­రిం­ది. ఉదయం గన్న­వ­రం వి­మా­నా­శ్ర­యా­ని­కి చే­రు­కు­న్న బిల్ గే­ట్స్‌­కు మం­త్రు­లు నారా లో­కే­శ్, అనిత, అచ్చె­న్నా­యు­డు, సత్య­కు­మా­ర్‌­తో పాటు జి­ల్లా అధి­కా­రు­లు ఘన స్వా­గ­తం పలి­కా­రు. అయి­తే ప్ర­తి­కూల వా­తా­వ­ర­ణం కా­ర­ణం­గా ఆయన ప్ర­త్యేక వి­మా­నం కొం­త­సే­పు వి­జ­య­వాడ నగరం చు­ట్టూ గా­ల్లో­నే చక్క­ర్లు కొ­ట్టిం­ది. పొ­గ­మం­చు, లో వి­జి­బి­లి­టీ కా­ర­ణం­గా ల్యాం­డిం­గ్‌­కు ఆటం­కం ఏర్ప­డిం­ది. సు­మా­రు అర­గం­ట­పా­టు గా­ల్లో­నే తి­రి­గిన అనం­త­రం ఎయి­ర్ ట్రా­ఫి­క్ కం­ట్రో­ల్ (ATC) క్లి­య­రె­న్స్ ఇవ్వ­డం­తో వి­మా­నం సు­ర­క్షి­తం­గా గన్న­వ­రం ఎయి­ర్‌­పో­ర్టు­లో ల్యాం­డ్ అయిం­ది. దీం­తో అధి­కా­రు­లు, సి­బ్బం­ది ఊపి­రి పీ­ల్చు­కు­న్నా­రు.

సచివాలయంలో కీలక భేటీ

వి­మా­నా­శ్ర­యం నుం­చి నే­రు­గా అమ­రా­వ­తి­లో­ని వె­ల­గ­పూ­డి సచి­వా­ల­యా­ని­కి వె­ళ్లిన బిల్ గే­ట్స్‌­కు సీఎం చం­ద్ర­బా­బు, ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కళ్యా­ణ్, మం­త్రు­లు ఘన స్వా­గ­తం పలి­కా­రు. అనం­త­రం గే­ట్స్ బృం­దం­తో కలి­సి సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. గే­ట్స్ ఫౌం­డే­ష­న్‌­కు చెం­దిన ఆరు­గు­రు ప్ర­తి­ని­ధు­లు కూడా ఈ పర్య­ట­న­లో పా­ల్గొ­న్నా­రు. సచి­వా­ల­యం­లో­ని రి­య­ల్ టైమ్ గవ­ర్నె­న్స్ కేం­ద్రా­న్ని బిల్ గే­ట్స్ ప్ర­త్యే­కం­గా సం­ద­ర్శిం­చా­రు. డేటా ఆధా­రిత పాలన ఎలా అమ­ల­వు­తోం­దో డి­స్‌­ప్లే వా­ల్‌ల ద్వా­రా చూ­పిం­చా­రు. యువ ఐఏ­ఎ­స్, ఐపీ­ఎ­స్ అధి­కా­రు­లు ధా­త్రి రె­డ్డి, మలి­కా గా­ర్గ్, ప్ర­ఖ­ర్ జైన్, సౌ­ర­బ్ గౌర్, సు­రే­శ్ కు­మా­ర్‌­లు ప్ర­జెం­టే­ష­న్లు ఇచ్చా­రు. డేటా లేక్ వ్య­వ­స్థ, అవే­ర్ 2.0, వా­ట్సా­ప్ గవ­ర్నె­న్స్, పీ­పు­ల్స్ పర్పె­ప్ష­న్, ఏజెం­ట్ స్పే­స్ ఏఐ సె­ర్చ్ బార్ వంటి అం­శా­ల­ను వి­వ­రిం­చా­రు. రా­ష్ట్రం­లో­ని అన్ని వి­భా­గా­ల­ను డేటా లేక్ ద్వా­రా అను­సం­ధా­నిం­చి వే­గం­గా ని­ర్ణ­యా­లు తీ­సు­కుం­టు­న్న వి­ధా­నా­న్ని గే­ట్స్ ఆస­క్తి­గా పరి­శీ­లిం­చా­రు.

అమరావతి నిర్మాణం

అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికలపై కూడా గేట్స్ వివరాలు తెలుసుకున్నారు. మౌలిక వసతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్‌పై సీఎం సమగ్ర వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను గేట్స్ ప్రశంసించినట్లు అధికారులు తెలిపారు.

పర్యటన ముగింపు

సు­మా­రు ఐదు­న్నర గం­ట­ల­పా­టు రా­ష్ట్రం­లో పర్య­టిం­చిన బిల్ గే­ట్స్, పటమట చె­న్ను­పా­టి రా­మ­కో­ట­య్య ము­న్సి­ప­ల్ ఇం­డో­ర్ స్టే­డి­యం­లో కొ­ద్ది­సే­పు బ్యా­డ్మిం­ట­న్ ఆడా­రు. అనం­త­రం గన్న­వ­రం వి­మా­నా­శ్ర­యా­ని­కి చే­రు­కు­ని ప్ర­త్యేక వి­మా­నం­లో ముం­బై మీ­దు­గా ఢి­ల్లీ­కి బయ­లు­దే­రా­రు. మొ­త్తం­గా, ఈ పర్య­టన ద్వా­రా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో అమ­ల­వు­తు­న్న టె­క్నా­ల­జీ ఆధా­రిత పా­ల­న­కు అం­త­ర్జా­తీయ గు­ర్తిం­పు లభిం­చిం­ది. సీఎం చం­ద్ర­బా­బు వి­జ­న్‌­పై గే­ట్స్ ప్ర­శం­స­లు కు­రి­పిం­చ­డం రా­ష్ట్రా­ని­కి గౌ­ర­వం­గా ని­లి­చిం­ది. డి­జి­ట­ల్ గవ­ర్నె­న్స్, ఆరో­గ్య రంగం, రా­జ­ధా­ని అభి­వృ­ద్ధి అం­శా­ల్లో భవి­ష్య­త్ భా­గ­స్వా­మ్యా­ని­కి ఈ భేటీ పు­నా­ది వే­సిం­ద­ని అధి­కార వర్గా­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­యి. సీఎం, మం­త్రు­లు, అధి­కా­రు­ల­తో సమా­వే­శ­మై పలు అం­శా­ల­పై కీ­ల­కం­గా చర్చిం­చా­రు. సు­మా­రు ఐదు­న్న­ర­గం­ట­ల­పా­టు బిల్ గే­ట్స్ రా­ష్ట్రం­లో పర్య­టిం­చా­రు. గేట్స్ పర్యటన విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తమవుతోంది.

Tags

Next Story