కొడాలి నాని వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ

కొడాలి నాని వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ
దంపతులే వచ్చి పూజలు చేయాలని శాస్త్రంలో ఎక్కడుంది.. మోదీ ఏ భార్యతో అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేశారు అంటూ.. మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలకు BJP కౌంటర్..

దంపతులే వచ్చి పూజలు చేయాలని శాస్త్రంలో ఎక్కడుంది.. మోదీ ఏ భార్యతో అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేశారు అంటూ.. మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలకు BJP కౌంటర్ ఇచ్చింది. కనీస జ్ఞానం లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణంలో ప్రధాని మోదీ పాల్గొన్నా పూజా క్రతువంతా పూర్తి చేసింది సలిల్ సింఘాల్ అంటూ స్పష్టం చేశారు కమలనాథులు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షులు, దివంగత అశోక్ సింఘాల్ సోదరుడైన సలిల్ సింఘాల్ సతీసమేతంగా భూమిపూజలో పాల్గొన్నారంటూ ఫొటోలు కూడా విడుదల చేశారు. ఆ వేదికపై ప్రధాని మోదీతోపాటు, యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారని వివరించారు. ముఖ్య యజమానిగా పూజను పూర్తి చేసింది సలిల్ సింఘాల్ అని గుర్తుంచుకోవాలన్నారు.

ఏపీ BJP కార్యదర్శి రమేష్ నాయుడు ఈ వివరాలన్నీ తెలుపుతూ ట్వీట్ చేశారు. కొడాలి నాని ప్రధానిపైన, యూపీ సీఎంపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు. అటు, YCP ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా మంత్రి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. నాడు శ్రీరాముడు యాగం చేసినప్పుడు కూడా బంగారుసీత విగ్రహాన్ని పక్కనపెట్టుకుని దాన్ని పూర్తి చేశారని వివరించారు. హిందూధర్మాన్ని చిన్నచూపు చూసేలా వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు. నిన్న తిరుమలకు CM జగన్ వస్తున్న సందర్భంగా డిక్లరేషన్‌ విషయంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టువస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా రావాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. వీటిని తప్పుపట్టిన కొడాలి నాని.. ప్రధానిపై నోరు పారేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story