నన్ను నిర్బంధించి రాత్రంతా 300 కిలోమీటర్లు తిప్పారు : విష్ణువర్థన్‌రెడ్డి

అమలాపురంలో తనను నిర్బంధించి రాత్రంతా 300 కిలోమీటర్లు తిప్పారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి మండిపడ్డారు. హిందువుల గురించి మాట్లాడడమే నేరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్.... పోలీస్ రౌడీ రాజ్యం నడుపుతున్నారని అన్నారు. రథం కాలిపోతే ఏంటని డీఐజీ మోహన్‌రావు మాట్లాడడం సిగ్గుచేటని, ఎన్‌కౌంటర్ చేస్తే ఏం చేస్తారని ఏలూరు రేంజ్ డీఐజీ బెదిరింపులకు పాల్పడ్డటం దారుణమన్నారు. మత ప్రాతిపదికన పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్, పోలీసులు ప్రత్యేక రాజ్యాంగం రాశారా అంటూ ఫైరయ్యారు.
చలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తనను నిర్బంధించి ఎక్కడ ఉంచారో చెప్పకపోవడం పట్ల DGP సమాధానం చెప్పాలన్నారు విష్ణు. కేంద్ర సహాయ మంత్రి హోదా ఉన్న వ్యక్తిని దొంగలా రహస్య ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఏంటని నిలదీసారు. ఈ అరాచకానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారన్నారు. విష్ణువర్థన్‌రెడ్డికి ఉన్న గన్‌మెన్‌లను, వ్యక్తిగత సిబ్బందిని కూడా కలవకుండా ఒక్కరినే తీసుకువెళ్లి నిర్బంధించడం పట్ల BJP నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com