నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నడ్డా పర్యటన

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక మధ్యాహ్నం రెండు గంటలకు తిరుచానూరులో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తరువాత శ్రీకాళహస్తిలో జగరగనున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించ నున్నారు.బహిరంగ సభకు ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
ఇవాళ సాయంత్రం శ్రీకాళహస్తి భేరివారి మండపంలో బీజేపీ బహిరంగ సభ జరగనుంది.ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నియోజక వర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే జాతీయ కార్యదర్శి సత్య కుమార్,రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణుకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. కాళహస్తి స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో కాషాయ మయంగా మారింది.
ఇక మధ్యాహ్నం రెండు గంటలకు తిరుచానూరులో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యకర్తలతో నడ్డా సమావేశం కానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తరువాత శ్రీకాళహస్తిలో జగరగనున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.బహిరంగ సభకు ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com