BJP: 'సీఎం రేవంత్‌ రెడ్డికి భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి'

BJP: సీఎం రేవంత్‌ రెడ్డికి భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి
X
బీజేపీ తెలంగాణ చీఫ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్

ఉప రా­ష్ట్ర­ప­తి పద­వి­ని హర్యా­నా గవ­ర్న­ర్ బం­డా­రు దత్తా­త్రే­య­కు ఇవ్వా­ల­న్న సీఎం రే­వం­త్ రె­డ్డి వ్యా­ఖ్య­ల­పై తె­లం­గాణ బీ­జే­పీ అధ్య­క్షు­డు రాం­చం­ద­ర్ రావు స్పం­దిం­చా­రు. దత్తా­త్రే­య­కు ఉప రా­ష్ట్ర­ప­తి పదవి ఇస్తే­నే బీ­సీ­ల­కు న్యా­యం జరు­గు­తుం­ద­ని.. అలా­గే తె­ల­గు వా­రి­కి సరైన గౌ­ర­వం దక్కు­తుం­ద­ని రే­వం­త్ అభి­ప్రా­యం వ్య­క్తం చే­శా­రు. అయి­తే ఈ మా­ట­లు ఇం­డి­యా కూ­ట­మి తరు­పున కా­ద­ని.. తె­లం­గాణ ప్ర­జల తరు­పున మా­ట్లా­డు­తు­న్నా­న­ని స్ప­ష్టం చే­శా­రు. ఈ వ్యా­ఖ్య­ల­పై సీఎం రే­వం­త్ స్పం­ది­స్తూ సీఎం రే­వం­త్‌ రె­డ్డి­కి భా­స్క­ర్‌ అవా­ర్డు ఇవ్వా­ల­ని ఎద్దే­వా చే­శా­రు. నో­బె­ల్ కాదు.. గో­బె­ల్స్‌ ప్ర­చా­రం ప్రై­జ్‌ ఇవ్వొ­చ్చ­ని వి­మ­ర్శిం­చా­రు. దత్తా­త్రే­య­ను ఉప­రా­ష్ట్ర­ప­తి చే­యా­ల­ని సీఎం రే­వం­త్ కో­ర­డం సం­తో­షా­న్చిం­ద­ని... అయి­తే తాను కూడా సీఎం రే­వం­త్ రె­డ్డి­కి ఒక డి­మాం­డ్ చే­స్తు­న్నా­మ­న్నా­రు. మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌­కు లేదా? పీ­సీ­సీ ప్రె­సి­డెం­ట్ మహే­శ్ కు­మా­ర్‌ గౌ­డ్‌­కు సీఎం పదవి ఇవ్వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు.

బీజేపీ అగ్ర కుల పార్టీ: కాంగ్రెస్

బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆక్షేపించారు. బిల్లును ఆమోదించాలని కేంద్రం, భాజపా అధిష్ఠానాన్ని ఎంపీ రఘునందన్‌రావు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు కావొద్దని ఆయన కోరుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘మా పీసీసీ అధ్యక్షుడు బీసీ బిడ్డ. మరి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మీ అధిష్ఠానాన్ని ఎందుకు డిమాండ్‌ చేయట్లేదు? మేం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో అన్ని అవకాశాలు కల్పించి తీరుతాం. బీసీ బిడ్డ కాకపోయినా మా సీఎం రేవంత్‌రెడ్డి బీసీ బిల్లు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌కు రఘునందన్‌రావు పాఠాలు అవసరం లేదు. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్‌. మీ వల్ల కాకపోతే రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యాక బిల్లును ఆమోదించుకుంటాం’’అని ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Tags

Next Story