Andhra Pradesh : వాళ్లంతా త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం : ప్రకాష్ జవదేకర్

prakash javadekar : విజయవాడ ప్రజా ఆగ్రహ సభలో వైసీపీ సర్కార్‌పై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ పూర్తిగా అవినవీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఈ సర్కార్‌కు దోచుకోవడమే తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. వాళ్లంతా త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కేంద్రం మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్. ఏడేళ్ల కిందట అనుమతులు ఇచ్చినా పోలవరం పూర్తి చేయలేదని ఎద్దేవా చేసిన జవదేకర్.. ఇలా ఏపీలో దౌర్భాగ్య పరిస్థితులపై గంటలకొద్దీ మాట్లాడవచ్చన్నారు.
అటు.. ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెడితే రాష్ట్రపతి పాలన తప్పదని ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో దోచుకుంటున్నారంటూ జగన్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఏపీ సర్కార్‌కు కేంద్ర సాయం వాడుకోవడం చేతకావడం లేదని.. రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వలేకపోతున్నారన్నారు. ఎంతసేపూ అప్పులు ఎలా తేవాలనేదానిపై దృష్టి పెట్టారంటూ సుజనా మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని.. పోలీసులను వైసీపీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారంటూ ఫైరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com