ఏపీలో అన్నీ స్కామ్‌లే తప్ప ఒక్క స్కీం లేదు : విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీలో అన్నీ స్కామ్‌లే తప్ప ఒక్క స్కీం లేదు : విష్ణువర్ధన్ రెడ్డి
శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ భూ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు నిరూపించి తీరతామని చెప్పారు. జనవరి 5వ తేదీ శ్రీకాళహస్తి బస్టాండ్‌కి ఎమ్మెల్యేలు వస్తారో, మంత్రులు వస్తారో చెప్పాలంటూ సవాల్ విసిరారు

ఇళ్ల పట్టాల కోసం పంపిణీ చేస్తున్న భూముల కొనుగోళ్లలో అంతులేని అవినీతి జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ భూ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు నిరూపించి తీరతామని చెప్పారు. జనవరి 5వ తేదీ శ్రీకాళహస్తి బస్టాండ్‌కి ఎమ్మెల్యేలు వస్తారో, మంత్రులు వస్తారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలకు జగన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు.

30 లక్షల ఇళ్ల నిర్మాణంలో ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదేనని స్పష్టం చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 60శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని, మిగతా మెుత్తం కేంద్ర ఉపాధి హామీ నిధులు వాడుకుంటున్నారని అన్నారు. అయినప్పటికీ.. ఇళ్ల పట్టాల పంపకాల్లో కనీసం మోదీ ఫోటో కూడా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కట్టించే ఇళ్లకు డబ్బులు భారతీ సిమెంట్‌ నుంచి తెస్తున్నవి కావని సెటైర్ వేశారు. ఏపీలో అన్నీ స్కామ్‌లే తప్ప ఒక్క స్కీం లేదని మండిపడ్డారు.


Tags

Read MoreRead Less
Next Story