అధికారులు సీఎం జగన్ కు భజన చేస్తున్నారు : బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
X
By - kasi |7 Nov 2020 1:40 PM IST
కేంద్రం అందిస్తున్న కరోనా సాయాన్ని మత ప్రాతిపదికన పాస్టర్లకు 5వేల రూపాయలు చొప్పున కేటాయించడం దారుణమని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. పాస్టర్లుగా ఉంటూ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లతో లబ్ధిపొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహరంపై కేంద్రం విచారణకు ఆదేశించిందని తెలిపారు. కేంద్ర పథకాలకు వైఎస్ఆర్, జగనన్న పేర్లు పెట్టి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, అధికారులు సీఎం జగన్ భజన చేస్తున్నారని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com